రైతు సమస్యల పరిష్కారానికి చర్యలు

Wed,June 12, 2019 01:43 AM

జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెండింగ్ రైతుబంధు పట్టాదారు పాస్ పుస్తకాలపై బుధ, గురువారాల్లో నిర్వహించే సమీక్షలపై మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో మధుమహన్ సహా జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల తహసీల్దార్లతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమావేశం నిర్వహించారు. తన అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ధర్మగంటను ఆశ్రయించిన బాధిత రైతులు, ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందని రైతాంగం సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. 12న (బుధవారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనగామ తహసీల్దార్ కార్యాలయంలో, అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బచ్చన్నపేట, 13న(గురువారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నర్మెట ఎమ్మార్వో కార్యాలయంలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరిగొప్పుల మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాల వారీగా రైతుబంధు పెండింగ్ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర రెవెన్యూ అంశాలు, సమస్యలపై సంబంధిత మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలతో పెండింగ్ పాస్ పుస్తకాలపై రైతుల సమక్షంలో సమీక్షిస్తారు. అదేవిధంగా ఆపద్బంధు, ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం లబ్ధిదారుల ఎంపికపై సమీక్షించి ఆయా మండలాల్లో రీఅసైన్‌మెంట్ కింద లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారు. జనగామ మండలంలో 144 మంది రైతులకు, బచ్చన్నపేట మండలంలో 717 మందికి, నర్మెట మండలంలో 408 మందికి, తరిగొప్పుల మండలంలో 552 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు అందజేయనున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles