భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

Wed,June 12, 2019 01:43 AM

-కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ : జిల్లాలో భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో భూసేకరణపై పలు శాఖల అధికారులతో మండలాల వారీగా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. భూసేకరణకు ఎదురవుతున్న అడ్డంకులు, పెండింగ్‌కు గల కారణాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ వంటి అంశాలపై కలెక్టర్ వారికి దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓజే మధు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాలతి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవోలు మధుమోహన్, రమేశ్, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రవీందర్‌రెడ్డి, ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles