టెక్నాలజీకి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

Wed,June 12, 2019 01:43 AM

జనగామ టౌన్ : పోలీసులు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి పోలీసులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జనగామ ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్, డీసీపీ శ్రీనివాసరెడ్డి జనగామ ఠాణాను ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈమేరకు డీసీపీ, ఏసీపీలు స్టేషన్‌లోని పెండింగ్ కేసుల్లోని పురోగతితోపాటు రాష్ట్ర పోలీస్‌శాఖ తీసుకుంటున్న నిర్ణయాలను ఏవిధంగా అమలు పరుస్తున్నారనే రికార్డులపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే కెమెరాల మానిటరింగ్ సెంటర్‌ను పరిశీలించి జనగామ పరిధిలో నూతన కెమెరాల బిగింపు చర్యలు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేకూరేవిధంగా మరింత మెరుగైన సేవలను అందించి రాష్ట్రంలోనే జనగామ పోలీసులు అదర్శంగా నిలవాలని సూచించారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ వాహనాలు కేవలం మెయిన్‌రోడ్డుల వరకే పరిమితం కాకుండా ప్రతీ గల్లీలో పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు పోలీసులున్నారనే భరోసాను కల్పించాలన్నారు. అనంతరం ఎంపీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో విధులను సక్రమంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్‌నాయక్, క్రైం కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుళ్లు సలీమ్, సురేశ్, అనిల్, రాజేందర్, రవి, వీరన్న, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles