ఐదోరోజు ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Wed,June 12, 2019 01:42 AM

జనగామ, నమస్తే తెలంగాణ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఐదోరోజు మంగళవారం ఉదయం ఫస్టియర్ జనరల్, ఒకేషనల్, మధ్యాహ్నం సెకండియర్ జనరల్, ఒకేషనల్ పరీక్షలు సజావుగా జరిగాయని ఇంటర్‌బోర్డు జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగిన ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ విభాగంలో మొత్తం 2252 మంది విద్యార్థులకు 108 మంది గైర్హాజరు కాగా, 2144 మంది (95.20 శాతం) విద్యార్థ్ధులు పరీక్షలు రాశారని, వీరిలో జనరల్ విభాగంలో 2009 మంది విద్యార్థులకు 92 మంది గైర్హాజరుకాగా, 1917 మంది (95.42శాతం) విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 243 మందికి 16 మంది గైర్హాజరు కాగా, 227 మంది (93.42శాతం) పరీక్షలు రాశారని తెలిపారు. మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగిన సెకండియర్ పరీక్షలకు మొత్తం 770 మందికి 39 మంది గైర్హాజరు కాగా, 731 మంది (94.94శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. వీరిలో జనరల్ విభాగంలో 637 మందికి 34మంది గైర్హాజరుకాగా, 603మంది (94.66శాతం), ఒకేషనల్ విభాగంలో 133 మందికి ఐదుగురు గైర్హాజరు కాగా, 128 మంది (96.94శాతం) విద్యార్థులు పరీక్షలు రాశారని డీఐఈవో శ్రీనివాస్ తెలిపారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles