మహిళల అభివృద్ధికే కస్టమ్ హైరింగ్

Wed,June 12, 2019 01:42 AM

దేవరుప్పుల, జూన్ 11: గ్రామీణులకు అవసరమైన వ్యవసాయ పనిమట్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తెవడంతోపాటు మహిళా గ్రూపులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని అడిషనల్ డీఆర్‌డీవో నూరొద్దీన్ అన్నారు. కడవెండిలో సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినా లీనారెడ్డి అధ్యక్షతన కస్టమ్ హైరింగ్ కేంద్రంపై రైతులు, మహిళలు, కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించగా నూరొద్దీన్ మాట్లాడారు. గ్రామంలో ప్రజలకు ఐదు రకాల గ్రూపులుగా విభజించి వారికి అవసరమైన వస్తువులు ఈ సెంటర్లో అందుబాటులో ఉంచుతారన్నారు. ఇక ఈ గ్రూపుల్లో ట్రాక్టర్ ఓనర్లు, చిన్న, సన్నకారు రైతులు, మహిళా గ్రూపులు, పాడి పశువులున్న రైతులు, కూలీలకు సంబంధించిన గ్రూపులుగా ఏర్పాటు చేస్తారన్నారు. రైతులకు వ్యవసాయ సీజన్‌లో అవసరమైన వ్యవసాయ సాంకేతిక పనిముట్లు ట్రాక్టర్ ఓనర్లకు, కూలీలకు ఆధునిక చేతి పనిముట్లు, పాడి పశువులు రైతులకు చాప్‌కట్టర్లు, పాలుపితికే యంత్రాలు, ఇలా ఎవరికి అవసరమైన యంత్ర పనిముట్లు వారికి అందుబాటులో ఉండేలా ఈ సెంటర్లో అన్ని పనిముట్లు అద్దె పద్దతిన దొరుకుతాయని ఆయన చెప్పారు.. మరో వైపు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, ఆధునిక సాంకేతిక పరికరాలు,గ్రామాల్లో లేనివి సభ్యులను అడిగి రికార్డు చేశారు. రైతు సమన్వయ సమితి కోర్డినేటర్ లీనారెడ్డి, డీపీఎం సుజాత, ఏపీఎం మురహరి, నరేందర్, సీసీలు యాకయ్య, సోమనారాయణ, రాంచంద్రం, వసంత, ఉమ, వీవోలు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles