పోలీసులకు ప్రశంసా పత్రాల అందజేత

Wed,June 12, 2019 01:42 AM

రఘునాథపల్లి, జూన్ 11: ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బాధ్యతతో విధులు నిర్వర్తించిన పోలీసులకు స్టేషన్‌ఘన్‌ఫూర్ ఏసీపీ వెంకటేశ్వర బాబు మంగళవారం ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వరబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రతీ ఎన్నికలు సజావుగా జరిగాయని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సై సూరం వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles