కేసీఆర్ హయాంలోనే నాణ్యమైన విద్య

Wed,June 12, 2019 01:41 AM

-రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ మోహన్ గాంధీనాయక్
కొడకండ్ల జూన్ 11 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ మోహన్‌గాంధీనాయక్ అన్నారు. మంగళవారం గిర్నతండాలోని మహత్మజ్యోతి రావుపూలే బాలికల గురుకుల పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశ్సీస్సులతో మండలంలోని గిర్నితండాకు బాలికల గురుకుల పాఠశాలను మంజూరు చేశారని గ్రామంలో గురుకుల పాఠశాల ఏర్పాటు సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్ అనంత రెడ్డి, ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్, గ్రామ సర్పంచ్ రాజ్కుమారనాయక్, భవన దాత రమేశ్ బ్రదర్, టీఆర్‌ఎస్ నాయకులు పాలెపు నాగేందర్, మండల టీఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెంచె రాజిరెడ్డి, దూమానాయక్ వెంకన్ననాయక్, రాజన్న నాయక్, కీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles