కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Wed,June 12, 2019 01:41 AM

రఘునాథపల్లి, జూన్ 11: భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి భవన నిర్మాణరంగ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాసమల్ల కొమురయ్య ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం మంత్రిని హైదరాబాద్‌లో కలిసి పలు సమస్యలను విన్నవించారు. భవన నిర్మాణరంగ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని కొమురయ్య అన్నారు. గత ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. పని ప్రదేశంలో కార్మికులు మృతి చెందితే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ. 15 లక్షలు, సాధారణ మరణం చెందిన వారికి రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 55 ఏళ్లు నిండిన ప్రతీ కార్మికుడికి పెన్షన్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించిన్నట్లు కొమురయ్య తెలిపారు. ఆయన వెంట గంగాధర్, అంజయ్య, కొండ సాయిలు, సాయిరెడ్డి ఉన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles