రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

Wed,June 12, 2019 01:41 AM

దేవరుప్పుల : దేవరుప్పుల మండలం సీతారాంపురం వద్ద జనగామ-సూర్యాపేట రోడ్డుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాలఘనపురం మండలం పటేల్‌గూడేనికి చెందిన పొన్నాల కుమారస్వామికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. సీతారాంపురం రైస్‌మిల్ దాటిన అనంతరం కుమారస్వామి తన బైక్‌పై నుంచి కింద పడి రోడ్డుపై గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా అటుగా వెళ్తున్న వారు చూసి సమాచారం అందించినట్లు కానిస్టేబుల్ యాకూబ్ తెలిపారు. క్షతగాత్రున్ని 108 వాహనంలో జనగామ ఏరియా దవాఖానకు తరలించగా అక్కడి చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్టు కానిస్టేబుల్ యాకూబ్ తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles