ఎంపీ పసునూరిని కలిసిన వికలాంగుల ఫోరం నేత శంకర్

Mon,May 27, 2019 01:45 AM

జనగామ, నమస్తే తెలంగాణ : వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన పసునూరి దయాకర్‌ను ఆదివారం ఆయన నివాసంలో నవతెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జి శంకర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా వికలాంగుల సమస్యలు, కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, పథకాలపై వినతిపత్రం అందజేశారు. ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎల్లంల జనార్దన్‌రెడ్డి, నాయకులు రోజు నరసింహచారి, ఓరుగంటి ఉమారాణి, అనంతోజు రమ, కేటీఆర్ యువసేన పట్టణ అధ్యక్షుడు బండ్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles