మతసామరస్యానికి ప్రతీక రంజాన్

Mon,May 27, 2019 01:45 AM

- పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్
- కాజీపేట దర్గాలో ఇఫ్తార్‌విందు

సిద్ధార్థనగర్, మే26: మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని సీపీ విశ్వనాథ రవీందర్ అన్నారు. ఆదివారం కాజీపేట దర్గాలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్‌విందును ఏర్పాటు చేయగా, సీపీ రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి, ముస్ల్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతతూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా రంజాన్‌మాసంలో ముస్లింలు ఉపవాసాలు చేయడం అభినందనీమనని అన్నారు. ఎంతో విశిష్టత కలిగిన రంజాన్‌మాసంలో ముస్లింలు కఠోర దీక్ష చేస్తారని కొనియాడారు. కార్యక్రమంలో ఏసీపీలు జనార్దన్, నర్సింగరావు, మసూద్, కాజీపేట సీఐ అజయ్‌కుమార్, స్థ్ధానిక కార్పొరేటర్ అబుబక్కర్, టీఆర్‌ఎస్ నాయకులు దర్శన్‌సింగ్, అంబాల రమేశ్, వెంకటాచార్యులు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles