ఇండ్లు కట్టిస్తామని మోసం

Sun,May 26, 2019 03:18 AM

-ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాకం
-2700 మంది నుంచి రూ. 30 వేల చొప్పున వసూలు
-నలుగురిని అరెస్ట్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు
-రూ. 12.22 లక్షలు, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
-జిల్లాలోనూ వందల మంది బాధితులు

భువనగిరి అర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లా తో పాటు జనగాం, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు కట్టిస్తామని ఆశ చూపి రూ.8.1 కోట్లకుపైగా వసూలు చేసి ఘరానా మో సం శనివారం వెలుగుచూసింది. కాగా ఆ ముఠా ను భువనగిరి పోలీసులు అరెస్టు చేసి రూ.12 లక్షల 22 వేలు రికవరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆఫర్ అట్రాక్ట్, మల్టీలెవల్ మార్కెంటింగ్‌తో ఇండ్లు కట్టిస్తామని నమ్మించి నాలుగు జిల్లాల పరిధిలో 2700 మందిని మోసం చేసి 8.1కోట్లు కాజేసిన వ్యక్తులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్‌ఓటీ, పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ క్యాంపు కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఎక్స్‌రోడ్, లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొండ కృష్ణమ్మ, కొండ రమేశ, ఖమ్మం జిల్లా జెల్ల చెరువు, కుసుమంచి పోస్టుకు చెందిన కొండ వెంకటనారాయణ, ద్వారకచంద్ర రెసిడెన్సీ, విజయపురి కాలనీ, కర్మాన్‌ఘాట్, సరూర్‌నగర్‌కు చెందిన కట్ట మహేంద్రనాథ్ ఠాగూర్, ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన కొత్త రాజిరెడ్డి, చైతన్యనగర్ జడ్చర్లకు చెందిన జజర్ల సాయిచరణ్ ఆరుగురు కలిసి రంగారెడ్డి జిల్లా కర్మాన్‌ఘాట్ సరూర్‌నగర్‌లో మాళ్యవి కరుణోదయ సొసైటీని 2004లో ఏర్పాటుచేశారు.

ఈ సొసైటీలో మేనేజర్‌గా కట్ట మహేంద్రనాథ్ ఠాగూర్, కోఆర్డినేటర్‌గా కొత్త రాజిరెడ్డి, ఆడ్మిన్ మేనేజర్‌గా జజర్ల సాయిచరణ్, మేనేజింగ్ డైరక్టర్‌గా కొండ కృష్ణమ్మ, జనరల్ సెక్రటరీగా కొండ రమేశ్, వైస్ ప్రెసిడెంట్‌గా కొండ వెంకటనారాయణ ఉన్నారు. ఈ ఆరుగురు కలిసి సొసైటీని నడిపిస్తున్నారు. నాటి నుంచి యాదాద్రి భువనగిరి, జనగాం, నల్లగొండ, సిద్దిపేట జిల్లాలోని మండలాల్లో ఉన్న గ్రామాల్లో తిరిగి ఇల్లులేని పేదలకు మాళ్యవి కరుణోదయ సొసైటీ ఆధ్వర్యంలో రూ.7.50 లక్షలు గల ఇంటిని నిర్మించి ఇస్తామని నమ్మించారు. ఇందుకు అడ్వాన్స్‌గా రూ.30 వేలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత రూ.2 లక్షల 20 వేలు ఇస్తే చాలని, మిగతా రూ.5 లక్షలు ఎన్‌ఆర్‌ఐ సంస్థ చెల్లిస్తుందని నమ్మించారు.

ఆలేరు మండలంలోని టంగుటూర్, కొలనుపాక, కాచారం, కాల్వపల్లి, రాజపేట, మూటకొండూర్, యాదగిరిగుట్ట మండలాల్లో సొసైటీ నిర్మిస్తున్న ఇండ్ల ఫొటోలు, వీడియోలు చూపించారు. నాలుగు జిల్లాల్లో 2700 మంది నుంచి రూ.30వేల చొప్పున మొత్తం రూ.8.1 కోట్లు 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు వసూళ్లు చేశారు. ఆరునెలలు గడుస్తున్నా ఇల్లు మాటే ఎత్తకపోవడంతో ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన వడ్డెపల్లి విజయ అనే మహిళ ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో కొండ కృష్ణమ్మపై మార్చి 25వ తేదీన ఫిర్యాదుచేసింది. దీంతో జిల్లా ఎస్‌ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles