బెంగళూరుకు మంత్రి ఎర్రబెల్లి

Sat,May 25, 2019 01:29 AM

లింగాలఘనపురం/తరిగొప్పుల, మే 24: వేసవి విడిది కోసం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో సహా వెళ్లిన లింగాలఘనపురం, నర్మెట, తరిగొప్పుల, జఫర్‌ఘడ్ మండలాలకు చెం దిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలిశారు. శుక్రవారం ఉద యం మంత్రి దయాకర్‌రావు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహబూబాబాద్ ఎ మ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోకలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం ద్వారా బెంగళూరు కు వెళ్లారు. వీరు అక్కడే ఉన్న జనగామ ఎమ్మెల్యే ము త్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మతో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు బస చేసిన రిసార్ట్ వద్దకు వెళ్లారు. వారికి లింగాలఘనపు రం జెడ్పీటీసీ అభ్యర్థి గుడి వంశీధర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ పుష్పగు చ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్థానిక సంస్థల టీ ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గె లుపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి జెడ్పీ టీ సీలు, ఎంపీటీసీలంతా సహకరించాలని కోరారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles