స్వచ్ఛ గ్రామాలకు సహకరించాలి

Sat,May 25, 2019 01:28 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ, మే24: ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకుని స్వచ్ఛ గ్రామాలకు సహకరిం చా లని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఈవోపీఆర్డీ మహబూబ్‌ఆలీ అన్నారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, నమిలిగొండ, పాం నూర్ తదితర గ్రామాల్లో ఆయన మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాంనూర్, శివునిపల్లి గ్రామ లబ్ధిదారులకు మరుగుదొడ్డి నిర్మాణ బిల్లులను అందజేశారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, లేకుంటే రేషన్‌బియ్యం, పింఛన్, నల్లా కనెక్షన్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా ఇప్పటికే 85 శాతం మ రుగుదొడ్ల నిర్మాణం పూర్తియిందన్నారు. ఓడీఎఫ్ కింద మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు చేసుకుని మండలాన్ని స్వచ్ఛ మండలం గా చేయడమే అందరి లక్ష్యం కావాలని సూచించారు. ఇం దుకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు టీ సురేష్‌కుమార్, కోతి రేణుక రాములు, ఉపసర్పంచ్‌లు వీరన్న, అయిలయ్య, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles