దయాకర్‌కు 4752 ఓట్ల మెజార్టీ

Sat,May 25, 2019 01:28 AM

-టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
-స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ధీమా
లింగాలఘనపురం, మే 24: మండలంలోని ప్రతీ గ్రామంలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు మెజార్టీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను, ఎంపీ ఎన్నికల్లో దయాకర్‌ను మండల ప్రజలు ఆదరించారు. దీంతో ప్రాదేశిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురనుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 26,357 ఓట్లు ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో 22,009 పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌కు 11,608, కాంగ్రెస్‌కు 6,856, బీజేపీకి 987 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 4752 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్ శ్రేణులు ఓ అంచనాకు వస్తున్నారు. మండలంలో 11 ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరుగగా, మొత్తం స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles