ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ కౌంటింగ్

Sat,May 25, 2019 01:28 AM

జనగామ టౌన్, మే 24: పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, జనగామ ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం డీసీపీ, ఏసీపీ మాట్లాడారు. గతంలో కంటే ప్రశాంతమైన వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పోలీస్‌సిబ్బంది ఎండను సైతం లెక్క చేయకుండా విధులను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ప్రధానంగా ప్రజల సహకారం కూడా ఉందని వారికి వెస్ట్‌జోన్ పోలీసులకు డీసీపీ అభినందనలు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా ప్రజల సహకరించాలని కోరారు. జిల్లాలోఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు. దీంతో వెస్ట్‌జోన్ జనగామ పోలీస్ బృందాన్ని వరంగల్ పోలీస్‌కమిషనర్ డాక్టర్ రవీందర్‌తో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అభినందించినట్లు డీసీపీ తెలిపారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles