ఘనంగా హనుమాన్ యజ్ఞం

Thu,May 23, 2019 02:23 AM

బచ్చన్నపేట, మే 22 : మండల కేంద్రంలోని అంజయ్యనగర్ (బీడీకాలనీ)లో బుధవారం హనుమాన్ సేవా సమితి ఆధ్వర్వంలో కాలనీలోని హానుమాన్ ఆలయం వద్ద హనుమాన్ మాలధారులు ఘనంగా యజం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు కృష్ణశర్మ ఆధ్వర్యంలో హనుమాన్ యజం చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేశారు. కాగా ఆలయ ప్రాంగణమంతా శ్రీరామనామస్మరణతో మార్మోగింది. జై శ్రీరాం.. జైజై శ్రీరాం.. ఓం శ్రీరామదూతాయనమః... అంటూ భక్తులు స్వామిని వేడుకున్నారు. ప్రతీ ఏడాది అంజయ్యనగర్‌కు చెందిన భక్తులు హనుమాన్ మాల ధరించి అంజన్నకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది సైతం హనుమాన్ మాల ధరించి అంజన్నకు చందనం వేసి తమలపాకుల, జిల్లెడు దండలతో అలంకరించారు. అనంతరం యజం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం చేశారు. కార్యక్రమంలో భక్తులు, గణపురం ఆనంద్, దాచేపల్లి మల్లేశం, తడకపల్లి కృష్ణమూర్తి, బుస్సా నాగరాజు, మలిపెద్ది నాగరాజు, సాగర్, భరత్, అజయ్, రాపెల్లి ప్రభాకర్ పాల్గొనగా సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, ఉపసర్పంచ్ కొండ హరికృష్ణ యజంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles