క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

Thu,May 23, 2019 02:23 AM

పాలకుర్తి రూరల్ : క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అన్నారు. బుధవారం దర్దెపల్లి గ్రామంలో ఆదర్శయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి చేస్తున్నారని చెప్పారు.

ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. ఆట పాటలతో పాటు చదువులో రాణించాలన్నారు. తాను స్వయంగా క్రీడాకారిణినని చెప్పారు. వాలీబాల్ బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడేదని తెలిపారు. మంత్రి దయాకర్‌రావు కబడ్డీ ఆటలో రాణించాడన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఇమ్మడి ప్రకాశ్, వీరమనేని యాకాంతారావు, యూత్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పసునూరి నవీన్, ఉప సర్పంచ్ నల్లా బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి కుమారస్వామి, యూత్ సభ్యులు పూజారి రాజు, నిమ్మల అనిల్, తోట రాజుకుమార్, మోకాటి యాదగిరి, దుంపల ఆశోక్, ఘనపురం రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles