గడువు ముగిసిన మందుల నిల్వపై విచారణ

Thu,May 23, 2019 02:23 AM

జఫర్‌ఘడ్ : జఫర్‌ఘడ్‌లోని మోహనకృష్ణ, మూర్తి ఆగ్రో ఏజెన్సీస్ దుకాణాల్లో జిల్లా వ్యవసాయాధికారి వీరూనాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు బుధవారం విచారణ చేపట్టారు. మోహనకృష్ణ, మూర్తి ఆగ్రోస్ దుకాణాల్లో ఈనెల 21న వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల తనిఖీల్లో మోహనకృష్ణ, మూర్తి ఆగ్రోస్ దుకాణాల్లో గడువు ముగిసిన పురుగు మందులు లభించడంతో వారిపై వ్యవసాయాధికారులు విచారణ చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి వీరూనాయక్ మాట్లాడుతూ.. జఫర్‌ఘడ్‌లోని మోహనకృష్ణ, మూర్తి ఆగ్రోస్ దుకాణాల్లో గడువు ముగిసిన పురుగు మందులు యాక్ట్ 1968, రూల్స్ 1971 ప్రకారం దుకాణాల్లో నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమన్నారు. ఒకవేళ షాపులో నిల్వ ఉంటే గడువు ముగిసిన పురుగు మందుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని వీరూనాయక్ తెలిపారు. గడువు ముగిసిన పురుగు మందులను ఇతర పురుగు మందులతో వేరుచేసి, ఎర్ర రంగుతో ఎక్స్ గుర్తులు పెట్టి, వ్యవసాయశాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. గడువు ముగిసిన పురుగు మందులు నిల్వ చేసిన షాపు యజమానులపై చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చినట్లు వీరూనాయక్ తెలిపారు. సంభదిత యాక్ట్ ప్రకారం సదరు దుకాణ యజమానులకు ఇచ్చిన నోటీసులకు వారంలోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌ఫూర్ ఏడీఏ ప్రదీప్ కుమార్, మండల వ్యవసాయాధికారి హరిదాస్ తదితరులున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles