సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 40 వేల విరాళం

Thu,May 23, 2019 02:23 AM

బచ్చన్నపేట: మండలంలోని వీఎస్‌ఆర్‌నగర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీశ్‌కుమార్ రూ. 40 వేలు విరాళంగా అందించారు. సర్పంచ్ కోనేటి స్వామి కోరిక మేరకు బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్సై రంజిత్‌రావు సమక్షంలో నగదును అందించారు. ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడిన వీఎస్‌ఆర్‌నగర్ జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై ఉండడంతో ప్రజల కోరిక మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు తాను ముందుకొచ్చినట్లు చెప్పారు. అనంతరం సతీశ్‌కుమార్, ఎస్సై రంజిత్‌రావును సర్పంచ్ సన్మానించారు. కార్యక్రమంలో కొన్నె సర్పంచ్ వేముల వెంకటేశ్‌గౌడ్, ఉప సర్పంచ్ ఛవాన్ నరేశ్, కొడవటూరు టీఆర్‌ఎస్ యూత్ నాయకులు మినలాపురం శ్రీనివాస్, నర్సన్న, గూడ మోహన్, రవీందర్‌రెడ్డి, అభిలాష్, శేఖర్, బిలాల్, వెంకటేశ్ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles