తల్లిని కుమారులకు అప్పగించిన సఖి బృందం సభ్యులు

Thu,May 23, 2019 02:23 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ, మే 22 : చిలుపూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో సిరికొండ సమ్మక్క అనే మహిళను తన కుమారులు దూరంగా ఉంచడంతో విషయం తెలుసుకున్న జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజ రమణ స్పందించి సమస్యను పరిష్కరించడానికి జనగామ జిల్లా సఖి బృందం సభ్యులను బుధవారం గ్రామానికి పంపించారు. ఈసందర్భంగా సఖి బృందం సభ్యులు గ్రామస్తులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ వద్దకు సిరికొండ సమ్మక్కను, ఆమె కుమారులను పిలిపించి గ్రామస్తుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తల్లి సమ్మక్కను ఆమె కుమారులకు అప్పగించారు. కాగా తనకు న్యాయం చేసిన సఖి బృందం సీఏ శోభ, సభ్యులకు సమ్మక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వప్న వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి రమ్య, అంగన్‌వాడీ టీచర్లు ఉమారాణి, పద్మ, వీఆర్‌ఏ రవి, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles