చెన్నూరు కాల్వ పనులను వేగవంతంగా పూర్తిచేయాలి

Thu,May 23, 2019 02:23 AM

కొడకండ్ల : కొడకండ్ల మండల ప్రజలు, రైతులకు వరప్రదాయినిగా నిలుస్తున్న చెన్నూరు రిజర్వాయర్ ప్రధాన కాల్వ నిర్మాణ పనులను గుత్తేదారులు వేగవంతంగా పూర్తిచేసి రైతులకు సకాలంలో సాగుజలాలు అందించేందుకు కృషి చేయాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని రామవరం గ్రామంలో చెన్నూరు రిజర్వాయర్ ప్రధాన కాల్వ నిర్మాణ పనులను ఆయన మండల నాయకులతో కలసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో చెన్నూరు రిజర్వాయర్, కాల్వల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పనుల నిర్వాహణపై నిర్లక్ష్యం, అసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయనవెంట మాజీ ఏఎంసీ చైర్మన్ సిందె రామోజీ, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ దీకొండ వెంకటేశ్వర్‌రావు, మండల నాయకులు కేలోత్ భిక్షపతి, మేటి సోమరాములు, చెంచు రాజిరెడ్డి, సర్పంచ్ శిరీష, రామేశ్వరం, సర్పంచ్ రాములునాయక్ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles