ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

Tue,May 21, 2019 01:11 AM

రెడ్డికాలనీ, మే 20: కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 23, 24వ తేదీల్లో టీఎస్‌ ఐసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌ఐసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఐసెట్‌ కోసం 49,465 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతిలో కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1954 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. 64 మంది పరిశీలకులను నియమించినట్లు తెలియజేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. 2905 మంది అభ్యర్థులు ఉర్దూలో పరీక్ష రాయనున్నారని, 24 మంది దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌తో ముందు రోజు పరీక్షా కేంద్రంలో సంప్రదించాలని, అంధులు స్ర్కైబ్‌ అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. ఆధార్‌కార్డు, ఫొటోతో డిక్లరేషన్‌ ఇవ్వాలని, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఉంటుందన్నారు. ఒక నిమిషం ఆలస్యం నిబంధన అమల్లో ఉందని, 23న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 24న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష సెంటర్‌కు గంట ముందు హాజరు కావాలని, అభ్యర్థులు హాల్‌టికెట్‌లోని సూచనలు పాటించాలని సూచించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles