వనసంపదను కాపాడుకోవాలి

Tue,May 21, 2019 01:11 AM

సుబేదారి, మే 20: వనసంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సింగరాయాచార్య అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా జనవిజాన వేదిక, వనసేవా సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ సుబేదారిలోని అటవీశాఖ కార్యాలయంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా ఆయన హాజరైన మాట్లాడారు. జీవవైవిధ్యానికి నెలవైన వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే నేరస్తులకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రజలకు అటవీ సంపద ప్రాముఖ్యత, మానవాళి జీవన విధానంలో జీవవైవిధ్యం పెనవేసుకున్న అనుబంధాన్ని తెలియజేయాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉందని వివరించారు. జీవజాతుల పరిరక్షణకు ప్రతీ పౌరుడు చొరవ తీసుకోవాలని, అడవులను ప్రామాణిక జాతిగా భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీ శాఖ సంరక్షణాధికారి అక్బర్‌ మాట్లాడుతూ మానవ జీవన విధానం వనసంపదతో ముడిపడి ఉందని గుర్తుచేశారు. మానవాళి మనుగడ అన్ని జాతుల జీవపరిమాణంతో ముడిపడి ఉందని వెల్లడించారు. బాధ్యతగా వనసంపదను కాపాడుకోవాలని సూచించారు. ప్రొఫెసర్‌ సింగారాయాచార్య పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జీవవైవిధ్య నేపథ్యాన్ని క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల అటవీ శాఖ అధికారులు రామలింగం, పురుషోత్తం, రేంజ్‌ ఆఫీసర్స్‌, వనసేవా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles