వైభవంగా లక్ష్మీనర్సింహుడి కల్యాణం

Sun,May 19, 2019 01:42 AM

మంగపేట మే18: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంపై మూడు రోజులుగా కొనసాగుతున్న లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణాన్ని శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు వేద పండితుల బృందం అభిజిత్ లగ్న సుముహూర్తంలో అశేష భక్త జనం నడుమ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవ వేడుకల్లో భాగం గా ఉదయం లక్ష్మీనర్సిహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మ వార్లకు వేద పండితులు శాస్ర్తోక్తంగా తిల తైలాభిషేకాలు జరిపి మేళతాళాల మధ్య కల్యాణ మండపానికి తీసుకొచ్చి పెళ్లి పీఠాలపై ఆసీనులను చేశారు. భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు మురళీకృష్ణమాచార్యులు, స్థానిక అర్చక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణ మహోత్సవానికి ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు ముందుగా చింతామణి జలపాతాన్ని సందర్శించి పుణ్యస్నానాలాచరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ చొరవతో నలభై ఏళ్ల అనంతరం లక్ష్మీనర్సింహస్వామికి సంబంధించిన ఆభరణాలను ఈ కల్యాణంలో ధరింపజేశారు. స్వామి వారు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంపించిన పట్టు వస్ర్తాలను ఏటూరునాగారం టీఆర్‌ఎస్ సీనియర్ నేత కాకులమర్రి లక్ష్మణ్‌బాబు సమర్పించారు. అదేవిధంగా దాత వామనరావు పట్టు వస్ర్తాలు, ఏటూరునాగారానికి చెంది న జ్యువెల్లరీ షాపు యజమాని ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. గుట్టపై భక్తుల తొక్కిసలాటలు జరుగకుండా సీఐ సత్యనారాయణ, ఎస్సై వెంకటేశ్వర్‌రావుల ఆధ్వర్యంలో పోలీసులు వలయంగా ఉండి కల్యాణ మూర్తులను తీసుకొస్తున్న అర్చక బృందానికి సహకరించారు. గుట్టపై నర్సింహసాగర్, గాంధీనగర్ గ్రామాల దాతలు, పలు ప్రాంతాల దాతల సహకారంతో కల్యాణ మహోత్సవానికి తరలివచ్చిన భక్త జనానికి మహాఅన్నదానం, పోలీసు శాఖ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గుట్టపై, పార్కింగ్ స్థలాల వద్ద బందోబస్తు నిర్వహించారు. వేడుకల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ, మాజీ చైర్మన్లు పూజారి శ్రీనివాస్, చిట్యాల పురుషోత్తం, పూజా రి సమ్మయ్య, జూనియర్ అసిస్టెంట్ సీతారాములు, ఆలయ ప్ర ధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, రాజశేఖర్‌శర్మ, పవన్ కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణశర్మ, ఈశ్వర్‌చందు, సుధీర్, చక్రధర్ పాల్గొన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles