ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని బాలిక మృతి

Sun,May 19, 2019 01:42 AM

ఏటూరునాగారం, మే 18 : మండలంలోని జీడివాగు సమీపంలోని పప్కాపురం మూల మలుపు వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇన్నోవా (టీఎస్03ఈపీ0369)వాహనం బైక్‌ను ఢీ కొనడంతో ఏడేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. జీడివాగు సమీపంలోని కొమురంభీం నగర్ గొత్తికోయగూడేనికి చెందిన ఇర్ప జయ తన కూతు రు స్రవంతి(7), తన అన్న కుర్స అరుణ్‌తో కలిసి ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై పప్కాపురంలోని అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో ములుగు నుంచి మల్లూరులోని శ్రీలక్ష్మీనర్సింస్వామి కల్యాణానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం పప్కాపురం మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీ కొంది. ఈ సంఘటనలో స్రవంతి(7) అక్కడిక్కక్కడే మృతి చెందింది. అరుణ్, ఇర్ప విజయలు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఇన్నోవా వాహనంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు మంకిడి పూర్ణచందర్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులతో పాటు స్రవంతి మృత దేహాన్ని మండలకేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలం నుంచి సీతక్క వెంటనే వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. దీనిపై బాలిక తండ్రి రమేశ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించామని హెడ్ కానిస్టేబుల్ సాం బారావు తెలిపారు. కాగా, సీతక్క వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.కాగా, బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles