మొదలైన పాలిసెట్ కౌన్సెలింగ్

Sun,May 19, 2019 01:42 AM

మట్టెవాడ, మే18: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్-2019 కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మొదలైంది. ఇందులో భాగంగా స్లాట్‌బుక్ చేసుకున్న విద్యార్థులు 422మంది హాజరై తమ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకున్నారు. విద్యార్థులు బుక్ చేసుకున్న సెంటర్‌కు సమయానికి హాజరుకావడంతో మొదటిరోజు ప్రక్రియ పూర్తయింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనే అంశంపై విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అంతేగాకుండా కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తాగునీరు, నీడకోసం టెంట్, కుర్చీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా కొంతమంది విద్యార్థులు పూర్తి చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బైరి ప్రభాకర్ వ్యవహరించగా, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఈగ మల్లికార్జున్, సుధాకర్, ఇతర అధికారులు రామకృష్ణ, సాంబశివరావు, ఫణికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

కేయూలో..
రెడ్డికాలనీ: కాకతీయ విశ్వవిద్యాలయం అడ్మిషన్ల సంచాలకుల కార్యాలయంలో శనివారం నుంచి ఈ నెల 21వరకు పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని అడ్మిషన్స్ సంచాలకుడు ఆచార్య మనోహర్ ప్రారంభించారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు, వెబ్‌ఆప్షన్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, అందుకు సంబంధించిన స్లాట్‌బుకింగ్ చేసుకుని ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని కోరారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles