చదువుల్లో రాణిస్తేనే మంచి భవిష్యత్

Sat,May 18, 2019 01:33 AM

పాలకుర్తి, మే17: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి కన్నవారి కలలు నెరవేర్చాలని, చదువుల్లో రాణిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందని పాలకుర్తి సీఐ రమేశ్‌నాయక్ అన్నారు. పదో తరగతి ఫలితాల్లో మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 10జీపీఎ సాధించిన విద్యార్థులను సీఐ రమేశ్, ఎస్సై గండ్రాతీ సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఐ రమేశ్‌నాయక్‌తో పాటు ఎంఈవో రఘూజీ మాట్లాడారు. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయిలో ఉండాలని, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విధుమౌళి, వీరమానేని వెంకటేశ్వర్‌రావు, జక్కుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతశిఖరాలకు ఎదగాలి : పెద్ది
చిలుపూరు : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగినపుడే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఆనందపడతారని పెద్ది వసంత మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని చిలుపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా వారిని సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం రామచంద్రారెడ్డి అధ్యక్ష జరిగిన సమావేశంలో వెంకటనారాయణగౌడ్ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా చిలుపూరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దినందుకు ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు మినరల్ వాటర్‌తో పాటు సైన్స్ పటాలను, ప్రొజెక్టర్‌ను అందించినట్లు, ప్రతీ ఏటా పాఠశాలను ఏదో విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి విద్యార్థులు బాసరలోని ఐఐఐటీలో చదువుతున్నారని, ఉన్నత స్థాయికి ఎదుగుతున్న విద్యార్థులను చూసి సంతోషంగా ఉందని అన్నారు. పేదరికంలో ఉన్న ఉత్తమ విద్యార్థులకు అండగా ఉంటానని అన్నారు. ఎంఈవో జయసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై ఆసక్తిని చూపినట్లయితే ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెరిగి మరింత విద్యాబోధనలో చతురతను ప్రదర్శిస్తారన్నారు. కాగా పాఠశాలకు చెందిన విద్యార్థిని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివించేందుకు పెద్ది వెంకటనారాయణ గౌడ్ అంగీకరించారు. అనంతరం విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. పాఠశాలలో అత్యత్తమ ప్రతిభ కనబరిచి 9.8 జీపీఏ సాధించిన వినయ్, ఉదయ్‌కిరణ్, 9.7 జీపీఏ సాధించిన ఎస్ సాత్విక, కే ఆశ్రిత, ఎంజైల్, వంశీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ గాండ్ల రాజు, ఉపాధ్యాయులు శ్రవణ్‌కుమార్, శ్రీరామారావు, రవీందర్‌తో పాటు పలువురు హాజరయ్యారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles