నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్ కేసులే..

Sat,May 18, 2019 01:32 AM

జనగామ టౌన్/బచ్చన్నపేట, మే 17: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ కేసులు తప్పవని ఎరువుల దుకాణాల నిర్వాహకులకు జనగామ ఏసీపీ ఎస్ వినోద్‌కుమార్, బచ్చన్నపేట ఎస్సై రంజిత్‌రావు హెచ్చరించారు. శుక్రవారం ఎరువుల దుకాణాల నిర్వాహకులతో జనగామ ఠాణాలో సీఐ మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన సమీక్ష నిర్వహించగా ఏసీపీ, అలాగే బచ్చన్నపేటలో ఎస్సై విలేకరులతో మాట్లాడారు. రాబో యే వర్షాకాలంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు అమ్మొద్దని ముందస్తుగా హెచ్చరించారు. రైతులు దళారులను నమ్మిమోసపోవద్దని, దళారులు రైతులను మోసగించేందుకు యత్నిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బిల్లులు ఉండాలని వ్యాపారులకు సూచించారు. జనగామలో నిర్వహించిన సమీక్షలో జనగామ సీఐ మల్లేష్‌యాదవ్, ఎస్సైలు శ్రీనివాస్, రాజేష్‌నాయక్, రవికుమార్‌తోపాటు జనగామ పట్టణంతోపాటు మండలంలోని ఎరువుల వ్యాపారులు, బచ్చన్నపేటలో ఎస్సైతోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles