జనగామ డిపో మేనేజర్ శ్రీకాంత్

Sat,May 18, 2019 01:31 AM

జనగామటౌన్, మే 17: హన్మకొండ నుంచి జనగామ మీ దుగా హైదరాబాద్ వెళ్లే లగ్జరీ, ఇంద్ర బస్సులు మినహా అన్ని బస్సులు జనగామ బస్టాండ్‌లో హాల్ట్ అవుతాయని జనగామ డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం జనగామ ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వారం రోజులుగా హన్మకొండ బస్టాండ్‌లో జనగామ ప్రయాణికులను ఆర్టీసీ డ్రైవర్లు ఎక్కించుకోవడం లేదని ఆరోపణలు వినవస్త్తున్నాయన్నారు. దీనిపై స్పందించిన డీఎం ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. హన్మకొండ నుంచి బయలుదేరే ఏసీ, లగ్జరీ, ఇంద్ర బస్సులు తప్ప మిగతా బస్సులు జనగామలో ఆగుతాయన్నారు. ఎవరైనా డ్రైవర్లు జనగామలో బస్సు ఆగదని వాగ్వాదం చేస్తే వెంటనే సంబంధిత డిపో మేనేజర్లకు సమాచారం అందిస్తే సంబంధిత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ డిపో 9959226050, వరంగల్-1డిపో 99592 26047, వరంగల్-2డిపో 99592 26048, హన్మకొండ డిపో 9959226049 మేనేజర్ల నంబర్లకు సమచారం అందించాలని శ్రీకాంత్ కోరారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles