హైపర్‌టెన్షన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Fri,May 17, 2019 01:07 AM

జనగామ టౌన్‌, మే 16: పేద ప్రజలకు ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న హైపర్‌టెన్షన్‌ సేవలను 18 ఏళ్లు పైబడిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్‌ పీ రఘు తెలిపారు. ఈనెల 17న (శుక్రవారం) ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా హైపర్‌టెన్షన్‌ డే ను పురస్కరించుకుని దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్‌ రఘు ప్రజలకు పలు సూచనలు చేశారు. దేశ వ్యాప్తంగా అనేక మంది హైపర్‌ టెన్షన్‌, హై బీపీ తదితర వ్యాధుల గురై మరణిస్తున్నారని, వీటిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ కేంద్రంలో ప్రత్యేక వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జిల్లా దవాఖానలోని ఎన్సీడీ విభాగంలో రక్త పరీక్షలు చేయించుకోవాని సూచించారు. గత నెలల నుంచి నేటి వరకు జిల్లా దవాఖానలో 396 మందిని హైపర్‌టెన్షన్‌ వ్యాధి గ్రస్తులుగా గుర్తించగా, ఇందులో ప్రభుత్వం అందించే ఉచిత వైద్యం, ఔషధాలతో 167మందిని హైపర్‌టెన్షన్‌ నుంచి దూరం చేసినట్లు తెలిపారు. అలాగే మరో 193 మంది వైద్యుల సూచనల ప్రకారం ప్రతీ నెలా వైద్య చికిత్స పొందుతున్నారని, మరికొంత మంది వారి వారి ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో చికిత్సలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles