పెండింగ్‌ ఖాతాల పై దృష్టి సారించాలి

Fri,May 17, 2019 01:07 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తే తెలంగాణ మే16: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగం గా పెండింగ్‌లో ఉన్న ఖాతాలపై దృష్టి సా రించాలని జిల్లా జేసీ ఓజే మధు స్థానిక రె వెన్యూ అధికారులకు ఆదేశించారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని జేసీ సందర్శించి, రికార్డులను పరిశీలించా రు. మండలంలోని పెండింగ్‌ ఖాతాల గు రించి తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని గ్రామా ల రెవెన్యూ అధికారులు. ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేసి పలు సూచనలు చేశారు. 7-సీ, 10-సీ, 1-3సీ డ్యాకుమెంటేషన్‌పై దృ ష్టిసారించాలని, ఆర్డీవో, తహసీల్దార్‌, తదితర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఖాతాల ను క్లియర్‌ చేయాలని, ఆధార్‌ ఆలస్యంగా ఇచ్చిన ఖాతాలను క్లియర్‌ చేయాలని ఆదేశించారు. అలాగే సేత్వార్‌, పహాణీల ఆధారంగా ఆర్‌ఎస్‌ఆర్‌ నివేదిక సరి చూసుకోవాలని, ఎక్కడైనా 7-సీ ఎక్కువగా పెండింగ్‌లో ఉన్న చోట సంబంధిత అధికారులకు దృష్టిసారించాలని తెలిపారు. అలాగే ఓఆర్‌సీ ఇతర సమస్యల పై కూడా దృష్టి సారించాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రెవెన్యూ సదస్సులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వ రకు మండలంలో 85శాతం భూ దస్ర్తాల ప్రక్షాళన పూర్తయిందని, 28 వరకు మిగిలినవిపూర్తి చేసి, రైతులకు పట్టాలివ్వాలని అన్నారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వ హించి, భూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అలాగే భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు, రైతు భీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించినా, విధుల్లో నిర్ల క్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను వినియోగించుకునేలా చూడాలని తెలిపారు.ఈ సమావేశం లో డీటీ జయచందర్‌, ఆర్‌ఐ కృపాకర్‌రెడ్డి, వీఆర్వోలు రాజయ్య, క్రాంతి, హరిత, శ్రీ కాంత్‌, రవి, కుమార్‌, సదానందం, ప్రవీణ్‌ రెడ్డి, వీఆర్‌ఏలు వెలిశాల రాము, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles