పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ భద్రత

Fri,May 17, 2019 01:06 AM

జనగామ రూరల్‌, మే16: జిల్లా పరిధి లో ప్రాదేశిక ఎన్నికలు మూడు విడతలు గా జరుగగా, వాటికి సంబంధించి బ్యాలె ట్‌ బాక్సులను అధికారులు జనగామ మం డలం పెంబర్తిలోని విద్యాభారతి ఇంజినీరింగ్‌ కళాశాల, శామీర్‌పేటలోని మైనారిటీ పాఠశాల, హైదరాబాద్‌ రోడ్డులోని ఏకశిల బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలలో భద్రపర్చారు. వాటిని గురువా రం వరంగల్‌ పోలీస్‌ కమిష నర్‌ రవీందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మా టాడుతూ పటిష్ట నిఘా నడుమ స్ట్రాంగ్‌రూంలలో బ్యాలెట్‌ బాక్స్‌లను భద్రపర్చా మని, కౌంటింగ్‌ జరిగే వరకూ ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్‌ బం దోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్ట్రాం గ్‌రూంల పరిసరాల్లో సీసీ కెమెరాలతో ని రంతరం నిఘా ఏర్పాట్లు చేశామని తెలిపా రు. వాటి పని తీరును స్వయంగా పరిశీలించినట్లు చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకూ తగిన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లు సహకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరుగకుండా తగి న చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. సీపీ వెంట డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమా ర్‌, సీఐ మల్లేశ్‌యాదవ్‌, ఎస్సైలు శ్రీనివా స్‌, రాజేశ్‌నాయక్‌, స్థానిక పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles