జూన్‌ 2లోగా పూర్తి చేయాలి

Fri,May 17, 2019 01:06 AM

జనగామ, నమస్తే తెలంగాణ, మే 16 : స్వచ్చ భారత్‌లో భాగంగా జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను జూన్‌ 2వతేదీ లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, ఏపీవోలు, ఈసీలతో గ్రామాల వారీగా మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఆయా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసేందుకు స్థానిక అధి కారులు ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేయించాలని, అందుకోసం లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి జిల్లాలో మిగిలిన అన్ని మరుగుదొడ్లను పూర్తి చేయించేందుకు సర్పంచులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతోపాటు ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులను సైతం భాగస్వాములను చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles