నేడు హేమాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

Thu,May 16, 2019 03:26 AM

-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-ఆళ్వార్‌ విగ్రహాలను ప్రతిష్ఠించిన అర్చకులు
-తరలివచ్చిన భక్తులు
-ధ్వజ స్తంభ ఇత్తడి తొడుగును బహూకరించిన దాతలు
మంగపేట మే15: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో గురువారం తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆళ్వార్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు శ్రీఅమరవాది మురళీకృష్ణమాచార్యులు, స్థానిక అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కమాల రాజశేఖరశర్మ పాల్గొని సంప్రదాయం ప్రకారం కార్యక్రమాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణపు సత్యనారాయణ, సిబ్బంది ఆళ్వార్‌ విగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులకు వేసవి తాపం నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లు వేశారు. స్వామిని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి భక్తులు తరలిరాగా, అర్చక బృందం వారి పేర ప్రత్యేక అర్చనలు జరిపించి, స్వామి వారి తీర్థాన్ని అందించి, ఆశీర్వచనం చేశారు. లక్ష్మీనర్సింహ స్వామి దేవస్థాన ఆవరణలోని ధ్వజ స్తంభానికి అవసరమైన ఇత్తడి తొడుగును సికింద్రాబాద్‌కు చెందిన ఏనుగుల రాజిరెడ్డి, పెంటమ్మ దంపతులు బహూకరించారు. పూజా కార్యక్రమాల్లో అర్చకులు పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈశ్వర్‌చందుశర్మ, సీతారాములు, సుధీర్‌, చక్రధర్‌, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles