వైభవంగా శుభమస్తు వెడ్డింగ్‌మాల్‌ ప్రారంభోత్సవం

Thu,May 16, 2019 03:26 AM

జనగామ టౌన్‌ : శుభమస్తు వెడ్డింగ్‌మాల్‌ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవాన్ని బుధవారం జనగామలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, యాంకర్‌ రష్మి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, జనగామ, స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని వెడ్డింగ్‌మాల్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో జనగామలో సరైన దుకాణాలు లేకుండాపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగేవని అన్నారు. రాష్ట్రప్రభుత్వ హయంలో వ్యాపారులకు అన్నిరకాల భద్రతలు కల్పించడం వల్లే నూతనంగా ఏర్పాటైన జిల్లా జనగామలో.. వరంగల్‌, హైదరాబాద్‌ తరహా దుకాణాలు ప్రారంభమవుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఇలాంటి దుకాణ సముదాయాలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకుని దూర ప్రయాణాలు తగ్గించుకోవాలన్నారు. అదేవిధంగా సినీ నటి రష్మి మాట్లాడుతూ.. జనగామలోని శుభమస్తు వెడ్డింగ్‌మాల్‌లో నూతన వస్త్ర ప్రపంచం కనువిందు చేస్తుందని సంతోషం వ్యక్తంచేశారు. వెడ్డింగ్‌మాల్‌ వద్దకు వచ్చిన ప్రజలతో ఫొటోలు దిగి కాసేపు సందడి చేశారు. అనంతరం దుకాణ నిర్వాహకులు రవీందర్‌రెడ్డి, రవి బంధుమిత్రులు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి ఆలయ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, లింగాల ఘణపూర్‌ టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి గుడి వంశీధర్‌రెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్‌పర్సన్‌ బండ పద్మ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, కౌన్సిలర్‌ ధర్మపురి శ్రీనివాస్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్‌కుమార్‌గుప్త, బిజ్జాల శ్రీకాంత్‌, ఉపేందర్‌తో పాటు పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles