కారు స్పీడ్‌ను అడ్డుకోలేరు..!

Wed,May 15, 2019 02:22 AM

-ప్రాదేశిక వార్‌ వన్‌ సైడే..
-స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌: ప్రాదేశిక ఎన్నికల్లో వార్‌ టీఆర్‌ఎస్‌ సైడే అయిందని, కారు స్పీడ్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోలేవని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బూత్‌ నంబర్‌ 40లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. వచ్చే నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పూర్తిస్థాయిలో పని చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కృషి చేయాలన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేయడానికి అధిక సంఖ్యలో తరలివచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాలను టీఆర్‌ఎస్‌ హస్తగతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు సీహెచ్‌ నరేందర్‌రెడ్డి, ఆకుల కుమార్‌, తోట వెంకన్న, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గట్టు రమేశ్‌, సర్పంచ్‌ టీ సురేశ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ నీల ఐలయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి మారపాక రవి, ఎంపీటీసీ అభ్యర్థులు గన్ను నర్సింహులు, మునిగాల రాజు, చింత సువర్ణ, పట్టణ అధ్యక్షుడు మునిగాల రాజు, నాయకులు బీ కృష్ణారెడ్డి, డాక్టర్‌ కే కుమార్‌ పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles