భారీ మెజార్టీతో ఆశీర్వదించండి

Mon,May 13, 2019 03:43 AM

-గులాబీ జెండా ఎగురవేయాలి
-ల్యాదెళ్ల, సింగరాజుపల్లిని దత్తత తీసుకుంటా
-సీఎం కేసీఆర్ ఆశయ సాధనలో ముందుండాలి
-అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
-త్వరలోనే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు
-పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్ల్లి దయాకర్‌రావు
దామెర, మే 12: పరిషత్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన ప్రతీ ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ల్యాదెళ్లలో టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉండి చల్లాను గెలిపించారని, అదేస్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు. అర్హులైన వృద్ధులకు ఇప్పటికే రూ. 1000 పింఛన్ ఇస్తున్నామని, వచ్చే నెల నుంచి రెట్టింపు చేసి రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 ఇవ్వనున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు 65 ఏళ్లు నిండితేనే వృద్ధాప్య పెన్షన్ వచ్చేదని, సీఎం కేసీఆర్ ఇప్పుడు 57 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీల ఎన్నికల ప్రచారంలో కొంతమంది వృద్ధులు పాల్గొనడం మంచిది కాదని, సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్‌తో వృద్ధులకు అండగా ఉండడాన్ని గమనించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి కాగానే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోపాటు నిరుద్యోగులకు రూ. 3 వేలు భృతి ఇవ్వబోతున్నామని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రైతాంగానికి అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీంతో ఎంతో మంది రైతులు, కూలీలకు న్యాయం జరుగుతుందన్నారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రావని, అధికార పగ్గాలు చేపట్టాలంటే ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ సూచించే వ్యక్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. దామెర ఎంపీటీసీ అభ్యర్థి కాగితాల శంకర్, జెడ్పీటీసీ అభ్యర్థి గరిగె కల్పన కృష్ణమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ల్యాదెళ్ల, సింగరాజుపల్లి గ్రామస్తులకు సూచించారు. రెండు గ్రామాలను తాను స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

త్వరలోనే వరంగల్, హన్మకొండ జిల్లాలు..
త్వరలోనే వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకుపోయి రెండు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. భూపాలపల్లి జిల్లా యథావిధిగానే ఉంటుందని, దామెర, ఆత్మకూరు మండలాలు భూపాలపల్లి జిల్లాలో కలుపుతన్నారనే వార్తలు అవాస్తమని అన్నారు. వదంతులను ప్రజలు నమ్మొద్దని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ప్రస్తుతం ఉన్న వరంగల్ రూరల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజవర్గం కలిపి వరంగల్ జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజవర్గాన్ని కలుపుకొని హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్లు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ఫోన్..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సీఎం కేసీఆర్ నుంచి రెండుమార్లు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో మాట్లాడించారు. మంత్రి ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సీఎం కేసీఆర్‌కు వివరించారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles