స్థానిక సంస్థల మండలికి పది పోలింగ్ కేంద్రాలు

Mon,May 13, 2019 03:42 AM

అర్బన్ కలెక్టరేట్, మే 12: వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్ దయానంద్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ..
2015లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు జిల్లాల పునర్విభజన అనంతరం నెలకొల్పిన ప్రతీ రెవెన్యూ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక పంపనున్నట్లు చెప్పారు.

ఏ కేంద్రంలో ఎవరంటే..

X వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జెడ్పీటీసీలతో పాటు హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, గీసుకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, సంగెం మండలాల్లోని మొత్తం 144 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ దయానంద్ తెలిపారు.
X గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ప్రమాణం చేసిన 64 మంది ఓటు వేయనున్నారు.
X నర్సంపేట ఎంపీడీవో కార్యాలయంలోని కేంద్రంలో నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్లు, చెన్నారావుపేట, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట, ఖానాపుర్, దుగ్గొండి మండలాలకు చెందిన 88 మంది సభ్యులు ఓటు వేయనున్నారు.
X పరకాల ఎంపీడీవో కార్యాలయంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు, ఆత్మకూర్, పరకాల, శాయంపేట, మండలాల ఎంపీటీసీలు మొత్తం 63 మంది ఓటు వేస్తారు.
X జనగాం ఎంపీడీవో కార్యాలయంలో జనగాం మున్సిపల్ కౌన్సిలర్లు, జనగాం, లింగాలఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, రఘునాథపల్లి, మద్దూరు, చేర్యాల మండలాలలకు చెందిన ఎంపీటీసీలు కలిపి 124 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
X స్టేషన్‌ఘన్‌పుర్ ఎంపీడీవో కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో స్టేషన్‌ఘన్‌పుర్, జఫర్‌ఘడ్, పాలకుర్తి, కొడకండ్ల మండలాలకు చెందిన 65 మంది ఎంపీటీసీలు ఓటు వేస్తారు.
X మహబూబాబాద్ ఎంపీడీవో ఆఫీసులో మహబూబాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు, కురవి, కేసముద్రం, డోర్నకల్,మహబూబాబాద్, గూడూరు, కొత్తగూడలోని 124 మంది ఎంపీటీసీలు ఓటు వేస్తారు.
X తొర్రూరు ఎంపీడీవో ఆఫీస్‌లో తొర్రూరు, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట మండలాలకు చెందిన 80 మంది ఎంపీటీసీలు ఓటు వేయనున్నారు.
X ములుగు జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రంలో ములుగు, వెంకటాపుర్, గోవిందరావుపేట, తాడ్వాయి సమ్మక్క-సారలమ్మ, ఏటూర్‌నాగారం మండలాలకు చెందిన 56 మంది ఎంపీటీసీలు ఓటు వేస్తారు.
X భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని కౌన్సిలర్లు, భూపాలపల్లి, గణపు రం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాలకు చెందిన 82 మంది ఎంపీటీసీలు ఓటు వే స్తారని జేసీ దయానంద్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాజకీయ పా ర్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. పరకాల పోలి ంగ్ కేంద్రం పరిధిలోకి మొగుళ్లపల్లి, రేగొండ మండలాల ఎంపీటీసీలను, కొత్తగూడ మండలంలోని ఎంపీటీసీలను నర్సంపేట పోలింగ్ కేంద్రంలో చేర్చాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పీ మోహన్‌లాల్, ఐ అండ్ పీఆర్ డీడీ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఎన్నిక ల విభాగం సూపరింటెండెంట్ కిరణ్‌ప్రకాశ్, టీ ఆర్‌ఎస్ నుంచి ఇండ్ల నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ నుంచి ఈవీ శ్రీనివాసరావు, బీజేపీ నుంచి రావు అమరేందర్‌రెడ్డి, సీపీఎం నుంచి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నుంచి పుల్లూరి అశోక్, కుసుమ శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles