ప్రచార హోరు

Sun,May 12, 2019 01:29 AM

-జోరుగా తుది విడత ప్రచారం
-పల్లెలు, గ్రామాల్లో గులాబీ జాతర
-రోడ్‌షోలు, సభల జోరు
-టీఆర్‌ఎస్‌కే సకల జనుల మద్దతు
-నేటితో ప్రచారానికి తెర
జనగామ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: తుది విడత ప్రాదేశిక ఎన్నికలకు ప్రచారం జోరందుకుంది. ఇందులో టీఆర్‌ఎస్ శ్రేణులు దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో శనివారం పల్లెలన్నీ ప్రచారంతో హోరెత్తాయి. అభ్యర్థులు తమ పరిధిలోని ఊరువాడా, పల్లెపట్నంలో గడపగడపకూ వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ కారుగుర్తుకే ఓటు వేయాలని నాయకులు కోరారు. మూడో విడత స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు, జఫర్‌ఘడ్, రఘునాథపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కొద్దిరోజులుగా ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు రోడ్‌షోలతో వీధులను హోరెత్తిస్తున్నారు. ఈ మేరకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ కారుగుర్తుకే ఓటేస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. పలుచోట్ల మహిళలు పెద్దసంఖ్యలో కోలాటాలు ఆడుతూ, పూలు చల్లుతూ, బతుకమ్మలు, బోనాలతో టీఆర్‌ఎస్ శ్రేణులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. దీంతో పల్లెలు, ఊర్లన్నీ గులాబీ జాతరను తలపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు అభ్యర్థులతో కలిసి రెట్టింపు ఉత్సాహంతో వారి గెలుపుకోసం గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా ఆయా గ్రామాలు, పల్లెలకు చేరుకుని ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గ్రామాల్లో మైకుల మోత..
ప్రచారం హోరెత్తడంతో గ్రామాలు మైకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు తమ అభ్యర్థుల గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శనివారం రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్‌షోలు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయనతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇతర పార్టీలకు ఓటేస్తే మురికికాల్వలో పడేసినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమవంతు బాధ్యతగా అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.

నేటితో మూగబోనున్న మైకులు
నేటితో తుది విడత ప్రచారానికి తెరపడనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు చివరి రోజు గడువు లోపల విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పార్టీ శ్రేణులు ఆయా గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా మండలాలు, గ్రామాలు రాజకీయ నాయకుల రాకపోకలతో సందడిగా మారాయి. రచ్చబండ వేదికగా అభ్యర్థుల గెలుపోటములు జోరుగా చర్చలు కొనసాగాయి. నేటితో ప్రచారానికి తెరపడనుండడంతో పల్లెలు ఒక్కసారిగా బోసిపోనున్నాయి.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles