టీఆర్‌ఎస్ సర్కార్‌తోనే అభివృద్ధి

Sun,May 12, 2019 01:20 AM

పోరాడి సాంధించుకున్న తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక మరుగున పడిన ఎన్నో ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. పూర్వకాలంలో బండగుట్ట ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఇక్కడి సత్రాలు, ఆలయంలో స్వయంభూగా వెలిసిన స్వామిని దర్శించుకుంటే ప్రతీ భక్తుడికి అర్థమవుతుందన్నారు. గత చరిత్ర ఎంతో ఘనంగా ఉన్న ఈ ఆలయానికి డీడీఎన్(ధూప, దీప, నైవేద్యం) పథకం మంజూరు కాకపోవడం విచారకరమన్నారు. ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి డీడీఎన్ పథకాన్ని మంజూరు చేయించి, ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఆలయ అభివృద్ధికి టీఆర్‌ఎస్ మండల ఇన్‌చార్జి రూ. లక్ష అందించగా, ఆ డబ్బుతో ఆలయానికి చేయించిన మరమ్మతులను టీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గుడి వంశీధర్‌రెడ్డి ఆలయ నిర్వాహకులకు రూ. 20 వేల చెక్కు అందించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, బోయిని రాజు, బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, గవ్వల మల్లేశం, సుధీర్‌రెడ్డి, ఏదునూరి వీరన్న, ఎడ్ల రాజు, కాటం కుమారస్వామి, బుట్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చల్ల వెంకటరెడ్డి, వేముల శ్రీనివాస్, చిట్ల జయశ్రీ, ఉడుగుల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles