నేటి నుంచి కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

Sun,May 12, 2019 01:20 AM

వరంగల్ క్రైం, మే 11: జెడ్పీటీసీ, ఎంపీటీసీ మూడో దశ ఎన్నికలను పురస్కరించుకుని ఆదివారం నుంచి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వీ రవీందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఇది అమల్లో ఉంటుందని, ఈ సమయంలో పోలీస్ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించొద్దని సూచించారు. అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఒకచోట చేరి గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సమావేశాలు నిర్వహించినట్లు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles