లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి

Sun,May 12, 2019 01:20 AM

పోచమ్మమైదాన్, మే 11: లోక్‌సభ ఎన్నికల లెక్కింపునకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్, వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆదేశించారు. 21న మాక్ కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. శనివారం పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్‌తో కలిసి వరంగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాముల్లో చేయనున్న కౌంటింగ్ ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సందర్భంగా అధికారులు, ఏజెంట్లు, సిబ్బందికి ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల పేర్లను, ఫొటోలను ఈ నెల 15లోపు అందజేయాలని ఏఆర్‌వోలకు సూచించారు. వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ హాల్‌లోకి అనుమతిస్తారని పేర్కొన్నారు. కౌంటింగ్ హాల్‌లోకి వేర్వేరుగా ప్రవేశ మార్గాలను బారికేడింగ్‌తో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు కమలాకర్, సుధాకర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కే వెంకారెడ్డి, సీహెచ్ మహేందర్, జీ రవికిరణ్, కిషన్, వెంకటాచారి, రమేశ్, తహసీల్దార్లు బావుసింగ్, నాగేశ్వర్‌రావు, రాజేశ్, బీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles