అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

Sat,May 11, 2019 02:21 AM

-చెరువుల్లోకి గోదావరి జలాలు
-అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు
-పార్టీకి వ్యతిరేకులపై చర్యలు తప్పవు
-ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
-ఎమ్మెల్సీ పల్లా , ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

జఫర్‌ఘడ్, మే 10 : అన్నివర్గాల సంక్షే మమే టీఆర్‌ఎస్ సర్కారు ధ్యేయమని, గో దావరి జలాలతో మండలంలోని చెరువులన్నింటినీ నింపిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్ర చారంలో భాగంగా శుక్రవారం మండలం లోని రఘునాథపల్లి, కూనూరు, ఉప్పుగ ల్లు, తిమ్మంపేట, తీగారం, హిమ్మత్‌నగర్, తమ్మడపల్లి(జీ), ఒబులాపూర్, సాగరం, కోనాయిచలం, జఫర్‌ఘడ్-1, జఫర్‌ఘడ్ -2 గ్రామాల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలి సి రాజయ్య ప్రచారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వానకాలం నాటికి స్టే షన్‌ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి మండ లంలోని అన్ని చెరువులను నింపేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులైన వారికి డబు ల్ బెడ్ రూం ఇండ్లు మంజూరి చేయనున్న ట్లు తెలిపారు. లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే రూ. 5 లక్షలు మంజూరి చేయనున్నట్లు తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమాని కి పాటు పడుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ను భారీ గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకా ల ఫలాలు అన్ని వర్గాల వారికి చెందాయని, వారంతా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు.

దంశా ఫీడర్ కాలువ మరమ్మతుకు రూ. 5లక్షలు మంజూరు చేయిస్తా..మండలంలోని సాగరం గ్రామ దంశా ఫీడర్ కాలువ మరమతుకు ఎన్నికల కోడ్ అనంతరం రూ.5 లక్షలు మంజూరి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతతూ గోదావరి జలాలతో చెరువులను నింపించేందుకు ఎమ్మెల్యే రాజయ్య కృషి చేస్తున్నాడన్నారు. దంశా చెరువు ఫీడర్ కాలువ మరమ్మతుకు తన సహకారం అందిస్తానని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకంగా, రెబల్స్‌గా పని చేసే వారిపై క్రమ శిక్షణా చర్యలు తప్పవని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి ఇల్లందుల బేబీ, టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు, ఆయా గ్రామా ల సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల బా ధ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఘన స్వాగతం పలికిన ప్రజలు
మండలంలోప్రచారానికి విచ్చేసిన ఎ మ్మెల్యే, ఎమ్మెల్సీలు రాజయ్య, రాజేశ్వర్‌రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు మంగళ హారతులతో స్వాగతించి పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. టీఆర్‌ఎస్ శ్రే ణులు నిర్వహించిన ర్యాలీలు, కోలాట పా టలతో గ్రామాలో మార్మోగాయి. కార్యక్రమాల్లో ఎంపీపీ గుజ్జరి స్వరూప, జెడ్పీటీసీ అభ్యర్థి ఇల్లందుల బేబి, స్థానిక పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles