జోరుగా టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం

Sat,May 11, 2019 02:19 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ/చిలుపూరు : ప్రాదేశిక ఎన్నికల ప్రచారం స్టేషన్‌ఘన్‌పూర్, చిలుపూరు మండలాల్లో జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు వి స్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఛాగల్లు ఎంపీటీ సీ అభ్యర్థి మాదిరెడ్డి రమ రాఘవరెడ్డి, మీదికొండ అభ్యర్థి కందుల రేఖ గట్టయ్య, తాటికొం డ-1 ఎంపీటీసీ అభ్యర్థి చల్లా సుధీర్‌రెడ్డి ఆయా ఎంపీటీసీ స్థానాల పరిధి గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీదికొండలో ఎంపీటీసీ అభ్యర్థి ఉపాధి పనుల వద్దకు వెళ్లి ఓటేయాలని అభ్యర్థించా రు. చిలుపూరు మండలం చిన్నపెండ్యాల టీఆర్‌ఎస్ ఎంపీటీ సీ అభ్యర్థి తాళ్లపల్లి ఉమ సమ్మయ్య గ్రామంలో ఇంటింటి ప్ర చారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించినట్లయితే రా నున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. అలాగే ఫత్తేపూర్ పరిధి బట్టుతండా, బోడబండ, కుచ్చిగుట్టతండా ల్లో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి భూక్య సరితను మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గిరిజనులు ప్రచారం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఆకుల కుమార్, అక్కనపల్లి బాలరాజు, సర్పంచ్‌లు పోగుల సారంగపాణి, నాగరబోయిన మణెమ్మ, చల్లా ఉమాదేవి, ఉపసర్పంచ్‌లు రవి, రం జిత్, అన్నెపు కుమార్, శ్రీను, సామేలు, రామక్రిష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. చిలుపూరు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు తాళ్లపెల్లి రాజ్‌కుమార్, భిక్షపతి, తిరుపతినాయక్, లింగయ్య, శ్యాం, గంగరాజు, నాగరాజు, సూరి, రాజు, రవి, రామగుండం సమ్మయ్య పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles