గ్రామ సదస్సుల్లో భూ సమస్యలకు పరిష్కారం

Sat,May 11, 2019 02:19 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ మే10: గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వా రా భూ సమస్యలకు పరిష్కారం లభి స్తుందని ఆర్‌ఐ కృపాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పాంనూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభ లో రైతులు భూ సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ వినతులు సమర్పించా రు. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐ మాట్లాడుతూ మండల రైతులు గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాస్‌పుస్తకాల్లో మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, సాదాబైనామాల్లో దరఖాస్తు చేసి పాస్‌పుస్తకాలు రాని వారి వివరాలు, వారసత్వ భూమి, ఒకరి పేరుతో రెండు ఖాతాలు , భూ వివరాల హెచ్చు, తగ్గులు తదితర సమస్యల పరిష్కార కోసం రైతులు దరఖాస్తులు చేస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సదస్సులో 34 మంది రైతులు వివిధ సమస్యలపై వినతులు స మర్పించినట్లు ఆర్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోతి రేణుక రా ము లు, ఉపసర్పంచ్ కే వీరన్న, వీఆర్వోలు శ్రీకాంత్, రాజయ్య, క్రాంతి, ప్రవీణ్, సురేశ్, వీఆర్‌ఏలు రాజ్‌కుమార్, వెలిశాల రాము, అభి, యాదేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు మనోధైర్యం కలిగి ఉండాలిపాలకుర్తి మే10: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు మనోధైర్యంతో ఉండాలని, భవిష్యత్‌లో రాణించడానికి అనేక మార్గాలు ఉన్నాయని కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి నవీన సూచించారు. శుక్రవారం స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్ర త్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు పదో తరగతి పరీక్షా ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయన్నాయని, విద్యార్థులు ఎలాంటి క్షణికావేశాలకు గురికావొద్దని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులుపాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles