గండిరామవరంలో ఓటేసిన జెడ్పీచైర్‌పర్సన్ దంపతులు

Sat,May 11, 2019 02:18 AM

నర్మెట, మే 10: మండలంలో శుక్రవారం జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ-నర్సింగరావు దంపతులు తన స్వగ్రామమైన గండిరామవరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పద్మ దంపతులు ఓటర్లతో కలిసి క్యూలో ని ల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. స్వగామానికి జెడ్పీచైర్‌పర్సన్ దంపతులు వచ్చారని తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు ఆమెను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా జడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ- నర్సింగరావు మాట్లాడుతూ.. నాలుగు పార్టీలు ఏకమై కుట్రలు పన్నినా ఉద్యమాల పురిటిగడ్డలోని జనగామ నియోజకవర్గ ప్రజలు గులాబీ పార్టీనే ఆదరించారని అన్నారు. బంగారు తెలంగాణ దిశగా ప్రతీ ఒక్కరూ పాటు పడాలని కోరారు. వారి వెంట గ్రామ సర్పంచ్ జ్వాల శ్వేత- కిషన్, మాజీ సర్పంచ్ బాండ్లపల్లి భూమాత-రాజు, ఉపసర్పంచ్ మిడిదోడ్డి మల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు తుప్పుడు బిక్షపతి, గద్దల విజయ్‌కుమార్, మటూరి రమేష్, జినుక రవీందర్, గద్దల బబ్లూ, బొడిక ఏల్లయ్య, వెంకన్న, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles