రెండో రోజు నామినేషన్ల జోరు..

Wed,April 24, 2019 03:06 AM

-జెడ్పీటీసీలకు-7, ఎంపీటీసీలకు-31
-నేడు ముగియనున్న తొలివిడత నామినేషన్ల స్వీకరణ
జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23: ప్రాదేశిక ఎన్నికల సమరంలో భాగంగా తొలి విడతలో మంగళవారం రెండోరోజు జిల్లాలో రాజకీయ పార్టీల నాయకులు మండలకేంద్రాల్లో కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. మే 6న దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘనపురం మండలాల్లోని 4 జెడ్పీటీసీ, 49 ఎంపీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు జెడ్పీటీసీ స్థానాలకు ఏడుగురు, ఎంపీటీసీ స్థానాలకు 31 మంది తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పాలకుర్తి మండలంలో జెడ్పీటీసీ స్థానానికి 2, ఎంపీటీసీ స్థానాలకు 13, దేవరుప్పుల మండలంలో జెడ్పీటీసీ స్థానానికి 2, ఎంపీటీసీ స్థానాలకు 10, కొడకండ్ల మండలంలో జెడ్పీటీసీ స్థానానికి 2, ఎంపీటీసీ స్థానాలకు 7, లింగాలఘనపురం మండలంలో జెడ్పీటీసీ స్థానానికి 1, ఎంపీటీసీ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి బుధవారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉండడంతో ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో తొలి విడత పోలింగ్ జరిగే నాలుగు మండలాల నోడల్ అధికారులతో పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ఆకునూరి మురళి, వ్యయ పరిశీలకుడు రవి సమీక్షించారు. తొలి విడత బుధవారం నామినేషన్ల స్వీకరణ ముగుస్తుండగా, 25న పరిశీలన, 26న అభ్యంతరాల స్వీకరణ, 27న విచారణ, 28న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి, గుర్తులు కేటాయించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

పాలకుర్తిలో 15 నామినేషన్లు..
పాలకుర్తి రూరల్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు మంగళవారం మండలంలో జెడ్పీటీసీకి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, ఎంపీటీసీ స్థానాలకు 13 మంది తమ నామినేషన్ పత్రాలు అందజేసినట్లు ఎన్నికల అధికారి వీ ఆశోక్‌కుమార్ తెలిపారు. బమ్మెర-2 స్థానానికి 1, లక్ష్మీనారాయణపురం-1, మంచుప్పుల-4, విస్నూరు-1, దర్దేపల్లి-1, వల్మిడి-1, ముత్తారం-1, మల్లంపల్లి-1, పాలకుర్తి-1 స్థానానికి రెండు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
నేడు ఆఖరు..
కొడకండ్ల: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా తొలివిడత నామినేషన్ల స్వీకరణ బుధవారం ముగియనుంది. రెండో రోజు మంగళవారం జెడ్పీటీసీ స్థానానికి రెండు, ఎంపీటీసీ స్థానాలకు 7 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడకండ్ల-1 ఎంపీటీసీ స్థానానికి 1, కొడకండ్ల-2 స్థానానికి 1, రామన్నగూడెం 2, రామవరం 1, ఏడునూతుల 1, రంగాపురం ఎంపీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్వోలు రామాచారి, పురుషోత్తంరెడ్డి, వెంకటాద్రి, సాయిరాంకుమార్ పాల్గొన్నారు.

మండలంలో 12 నామినేషన్లు
దేవరుప్పుల: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రెండో రోజు మంగళవారం మరో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. జెడ్పీటీసీ స్థానానికి నీర్మాల గ్రామం నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకు కామారెడ్డిగూడెం నుంచి 2, సీతారాంపురం నుంచి ఒకటి, చినమడూరు నుంచి 2, అప్పిరెడ్డిపల్లి నుంచి 1, నీర్మాల నుంచి 1, ధర్మాపురం నుంచి 1, దేవరుప్పుల 1, మాదాపురం నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా భార్గవి..
జెడ్పీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నీర్మాలకు చెందిన పల్ల భార్గవిరెడ్డి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భార్గవి వెంట ఎంపీపీ కొల్గూరు సోమయ్య, కాడబోయిన యాదగిరి, మలిపెడ్డి నవీన్, పల్ల సుందరరాంరెడ్డి ఉన్నారు. భార్గవి తన నామినేషన్ సెట్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా ఉద్యాన అధికారి కేఆర్ లతకు అందజేశారు.
ఎన్నికల అధికారికి ఏ-ఫారం అందజేత
పాలకుర్తి నియోజకవర్గ స్థాయి జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ-ఫారంలు అందిజేసే అధికారాన్ని పాలకుర్తి ఎన్నికల ఇన్‌చార్జి జన్ను జకారియాకు పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అప్పగించారు. ఈ నేపథ్యంలో జన్ను జకారియా రాష్ట్ర పార్టీ అందించిన ఏ-ఫారంను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గూడూరు రాంరెడ్డికి అందజేశారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పాలకుర్తి అధికార ప్రతినిధి మేకపోతుల ఆంజనేయులు, పాలకుర్తి దేవస్థాన డైరెక్టర్ కొత్త జలేందర్‌రెడ్డి ఉన్నారు.

144
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles