యువత సేవలు అభినందనీయం

Wed,April 24, 2019 03:05 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23 : చిలుపూరు మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో ఫత్తేపూర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో యువత చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, సేవలు అభినందనీయమని స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఫత్తేపూర్ గ్రామంలో ఫత్తేపూర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా సీఐ రాజిరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న యువసేన సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుగులోత్ నర్సింహానాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, వారి కుటుంబానికి యువసేన ఆధ్వర్యంలో సీఐ రాజిరెడ్డి చేతుల మీదుగా బియ్యం పంపిణీచేశారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనే ఆలోచనతో పనిచేస్తున్న యువసేన సభ్యులు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు గుగులోత్ బాలునాయక్, ఉపాధ్యక్షుడు భాస్కర్, ట్రెజరీ గుగులోత్ ప్రేమ్‌దాస్ నాయక్, కార్యదర్శి రవీందర్, సభ్యులు యాదు నాయక్, సత్తయ్య, ప్రవీణ్, మోతీ, అరుణ్, యాకూబ్, సర్పంచ్ బానోత్ రూప్లా నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు, శంకర్, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మోహన్‌దాస్, బాపురావు, శ్రీనివాస్, రాములు, గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles