విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీయాలి

Wed,April 24, 2019 03:05 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 23 : విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అన్నారు. మంగళవారం జనగామలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల 44వ వార్షిక క్రీడా దినోత్సవం ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోని లేని యువతరం భారతదేశంలో ఉన్నారని, అయితే సెల్‌ఫోన్‌తో సమయాన్ని వృథా చేసుకుంటున్న యువతరం చేతిలో ఉన్న ఫోన్‌ను విజ్ఞాన నైపుణ్యానికి ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని పురుషోత్తం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు పోకల చందర్, వైద్యుడు సీహెచ్ రాజమౌళి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కాసం అంజయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ ప్రతినిధి నాగబండి సుదర్శనం, రిటైర్డు అధ్యాపకులు డాక్టర్ ఎం రాములు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టీ సాంబశివరావు, క్రీడా కన్వీనర్ శ్రీధర్, అధ్యాపకులు డాక్టర్ కలువల శ్రీనివాస్, ఎం బాలరాజు, ఈ శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, ఎల్ తిరుపతి, సంధ్య ప్రసన్న, స్వరూప, అన్నపూర్ణ, ఉమ, రామిరెడ్డి, రామచంద్రం, రవిప్రసాద్, దినేశ్, విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల క్రీడా, సాంస్కృతిక, కళా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

పీజీ కళాశాల స్థల పరిశీలన
మండల పరిధి జనగామ-సిద్ధిపేట రోడ్డులో పసరమడ్ల శివారు చంపక్‌హిల్స్‌పై ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని మంగళవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం పరిశీలించారు. పీజీ కాలేజీ భవన నిర్మాణానికి అవసరమైన స్థలానికి రెవెన్యూశాఖ హద్దులు కూడా నిర్ణయించిందని, వెంటనే భవన నిర్మాణాన్ని చేపడితే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ కే ఐలయ్య వివరించారు. అనంతరం జనగామలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో జరుగుతున్న పీజీ రెండో సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఎంకాం, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులను తనిఖీ చేశారు.

35
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles